Shree Ring - A1134

Shree Ring - A1134
Rs. 515/-
Product Code : A1134
శ్రీ ఉంగరం, ஸ்ரீ மோதிரம்If one wears Sri Ring is blessed with wealth and Prosperity.

సుభిక్షము, సుఖసంతోషము, సుసంతానము, సుగుణము, సుమంగళిత్వమును, సుకర్మమును ప్రసాదించే
శ్రీ ఉంగరం
శ్రీ అనే పదాన్ని సిరిసంపదల దేవత లక్ష్మీదేవిగానూ, దైవ సూచికంగానూ, ధన సూచికగానూ, గౌరవ సూచిక గానూ, శుభ సుచికగానూ, ఆరంభ సూచికగానూ... ఇలా ఎన్నో భావాలలో వాడుతారు. శ్రీ లేదా లక్ష్మి లేదా మహాలక్ష్మి హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. సంస్కృతంలో లక్ష్మి అన్న పదానికి మూల ధాతువులు – లక్ష్ – పరిశీలించుట, గురి చూచుట. ఇదే ధాతువును లక్ష్యం అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది అని భావం.
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవికి విశిష్టమైన స్థానం ఉన్నది. ఈమె విష్ణుమూర్తి పత్నిగా, జగన్మాతగా, భక్తుల ప్రార్థనలను ఆలకించి, వాటిని నాథుని సన్నిధానంలో నివేదించి, వారిని క్షమింపజేసే పురుషకార రూపిణిగా పలువిధాలుగా పూర్వాచార్యులు నిరూపించారు.  వీరి ప్రకారం లక్ష్మీ శబ్దానికి లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీః హరిప్రియా అన్నట్లు పర్యాయ వాచకం అయిన శ్రీ శబ్దానికి గల వివిధ వ్యుత్పత్తులను ఆధారం చేసుకొని ఈమె వైభవాన్ని నిరూపించారని శ్రీ వైభవం వివరిస్తోంది.
ఇక ఈ అష్టధాతు శ్రీ ఉంగర నిర్మాణం గురించి చర్చిద్దాం. శుభగ్రహాలైన గురు, శుక్ర త్రికోణ కూడలి నక్షత్ర ఆకారం దాల్చి దాని మధ్యలో అలరారుతూంటుంది శ్రీ. అలాగే ఈ కూడలి కారణంగా ఏర్పడిన ఆరు చిన్న త్రిభుజాల మధ్య శ్రీ అంటే మహాలక్ష్మికి ఇష్టమైన, సూచికమైన శుభ అంకెలైనటువంటి 6, 4, 5, 8, 2, 7 అలరారుతూంటాయి. మహాలక్ష్మి ఆరు సుగుణములను పరిపూర్ణంగా కలిగిన దేవత కనుక 6 సంఖ్య మొదటి చిన్న త్రిభుజమున సూచింపబడినది. అగ్నిపురాణం ప్రకారం శ్రీమాత శంఖ – చక్ర – గదా – పద్మ – ధారిణి కనుక 4 సంఖ్య రెండవ చిన్న త్రిభుజమున సూచింపబడినది. శ్రీమహాలక్ష్మిలో అక్షరాలు ఐదు కనుక 5 సంఖ్య మూడవ త్రిభుజమున సూచింపబడినది. లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు – ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి – ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను అందిస్తుంది కనుక 8 సంఖ్య నాల్గవ చిన్న త్రిభుజమున సూచింపబడినది. మత్స్యపురాణంలో లక్ష్మికి ఇరువైపుల తొండములందు పాత్రలతో అభిషేకించు గజరాజులుంటాయని చెప్పబడివుంది. ఆ రెండు గజములు శంఖ పద్మ నిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది కనుక 2 సంఖ్య ఐదవ చిన్న త్రిభుజమున సూచింపబడినది. ఇక 7 సంఖ్య శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైన సంఖ్య అంతేగాక ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం) కనుక 7 సంఖ్యను ఆరవ చిన్న త్రిభుజమున సూచింపబడినది. ఇంతటి మహిమ కలిగిన శ్రీ ఉంగరాన్ని ధరించినవారికి సకల సుభాలు కలుగుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఈ అష్టధాతు శ్రీ ఉంగరాన్ని ధరించడం ద్వారా కలిగే లాభాలు :-
1.       అష్టధాతు శ్రీ ఉంగరాన్ని ధరించి ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మి కమలధారిణి హంస సోహం స్వాహా అనే మంత్రాన్ని ప్రతి రోజు 1008 మారుల పఠించి లక్ష్మీదేవిని తెల్లపువువలతో పూజించి ఆరాధిస్తే ఆరు నెలల అనంతరం నిధికి సంబంధించిన ఆచూకి తెలుస్తుంది.
2.       ఈ ఉంగరాన్ని ధరించి లక్ష్మీదేవి చిత్రపఠం లేక విగ్రహం ముందు కొబ్బరినూనెతో దీపారాధన చేస్తూ వస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మొండి బాకీలు వసూలౌతాయి.
3.       శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని అంటే ఎన్నడు విడివడనిది అని, లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. కనుక ఈ అష్టధాతు శ్రీ ఉంగరాన్ని దంపతులు ధరించినట్లైతే వారి మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఎన్నడూ విడిపోరు.
4.       అష్టధాతు శ్రీ ఉంగరాన్ని ధరించి ఓం శ్రీం హ్రీం శ్రీం అని ప్రతి రోజూ 1008 మార్లు పఠించడం ద్వారా క్రమేపి మొండి రోగాలనుండి ఉపశమనం లభిస్తుంది.
5.       శ్రీ ఉంగరాన్ని ధరించి శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రమును 108 సార్లు పఠిస్తూ శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసేవారికి ఈతి బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ధనం ఏదో ఒక విధంగా చేతికి అందుతుంది. అనవసర ఖర్చులు తగ్గుముఖం పడతాయి. పొదుపు చేయగలుగుతారు.
6.       స్త్రీపురుషులు ఇరువురూ, చిన్న పిల్లలనుండి వృద్ధుల వరకు ఎవరైనా ధరింపదగ్గ ఈ శ్రీ ఉంగరం ద్వారా జీవితాశయం నెరవేరుతుంది. కుటుంబంలో మనఃశ్శాంతి, ఆనందం కలుగుతాయి.
7.       ఈ ఉంగరం ధరించేవారికి సమాజంలో కీర్తిప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు లభిస్తాయి.
8.       శ్రీ అనే పదాన్ని తెలుగు భాషలోను, సంస్కృతంలోను, సంబంధిత భారతీయ భాషలలోను వివిధ భావాలలో వాడుతారు. వాటిలో ప్రధానమైనవి.
9.       సిరిసంపదల దేవత లక్ష్మీదేవి
10.   దైవ సూచకం (శ్రీ మహావిష్ణువు, శ్రీ ఆంజనేయా, శ్రీ గణేషా, శ్రీమదాంధ్ర ...)
11.   ధన సూచకం (శ్రీలు పొంగిన జీవగడ్డరా, శ్రీకర కరుణాల వాల)
12.   గౌరవ సూచకం (శ్రీ సుబ్బారావు గారు, శ్రీయుతులు ...)
13.   శుభ సూచకం (శ్రీ
14.   ఆరంభ సూచకం (శ్రీకారం) ప్రబంధాలు శ్రీకారం తో ప్రారంభించడం తెలుగు సాహిత్యంలో ఒక ఆనవాయితీ.
15.   శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జగన్మాత లక్ష్మీదేవికి విశిష్టమైన స్థానం ఉన్నది. ఈమె విష్ణుమూర్తి పత్నిగా, జగన్మాతగా, భక్తుల ప్రార్ధనలను ఆలకించి, వాటిని నాథుని సన్నిధానంలో నివేదించి, వారిని క్షమింపజేసే పురుషకార రూపిణిగా పలువిధాలుగా పూర్వాచార్యులు నిరూపించారు. వీరి ప్రకారం లక్ష్మీశబ్దానికి "లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీః హరిప్రియా" అన్నట్లు పర్యాయ వాచకం అయిన శ్రీ శబ్దానికి గల వివిధ వ్యుత్పత్తులను ఆధారం చేసుకొని ఈమె వైభవాన్ని నిరూపించారు.
16.   శ్రీ వైభవం: .భాష్యకారాచార్యులు మార్చి 2008 సప్తగిరి సంచికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
17.    
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ !
18.   లక్ష్మి (Lakshmi) లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు. క్షీర సాగర మధనం సమయంలో అవతరించింది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది.
19.   సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట. ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు.
20.   మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు. సీతగారాముని పెండ్లాడినది. రాధరుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే
21.   బెంగాల్లో దుర్గాపూజ సమయంలో లక్ష్మిసరస్వతివినాయకుడుకార్తికేయుడు - వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు.
22.   హిందూమతంలో వైదికకాలంనుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా, సంప్త్పదాయినులుగా ఆరాధించారు.అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.
23.   లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని' (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
24.   సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.
25.   తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.
26.   విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.
27.   విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారం లో సీత గాకృష్ణావతారం లో రుక్మిణి గా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి కి తోడు అలమేలు మంగ గా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.
28.   చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లుఅష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
29.   అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
30.   వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా).
31.   యజుర్వేదం పురుష సూక్తం లో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం , వాజసనేయ సంహిత లలో ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణం లో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.
32.   లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
33.   జైన, బౌద్ద కళలలో కూడా లక్ష్మీదేవి రూపకల్పన కొన్నిచోట్ల గమనించవచ్చును. గ్రీకు పురాణ దేవత ఆఫ్రొడైట్ మరియు రోమన్ పురాణ దేవత వీనస్  స్వరూప, కధాంశాలలోను లక్ష్మి స్వరూప కధాంశాలలోను కొంత సారూప్యత కనిపిస్తుంది.
34.   బౌద్ధమతం సాహిత్యంలో మిళింద, పన్హ, సిరికాలకణ్ణి జాతక కధము, ధమ్మపధ అట్టకధలు శ్రీమాతను "సిరిమా" దేవతగా పేర్కొన్నాయి. కధల ప్రకారం ఆమె సౌందర్య, అదృష్ట, ప్రజ్ఞా శక్తులు ప్రసాదించే కరుణాంతరంగ. జైనమతం కల్పసూత్రం ప్రకారం వర్ధమాన మహావీరుడు జన్మించడానికి ముందు అతని తల్లికి కలిగిన స్వప్నాలలో శ్రీమాత కూడా ఉంది. సింధులోయ నాగరికత కు సంబంధించి లభించిన ప్రతిమలలో ఆభరణ భూషితలైన మాతృదేవతల ప్రతిమలున్నాయి. మౌర్యుల కాలానికి చెందిన కొన్ని శిల్పాలలో కూడా అలాంటి మాతృదేవతామూర్తులున్నాయి. మూర్తులే లక్ష్మీదేవి రూపానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చును.
35.   లక్ష్మి దేవిని స్తుతించేందుకు పురాతనమైనవి, ఆధునికమైనవి అనేక ప్రార్ధనలు, గానాలు, పద్యాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని:
36.   మహాలక్ష్మ్యష్టకం
37.   శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
38.   దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||
39.   ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః ఇత్యాది ప్రకీర్తితః ||
40.   ధ్యానమ్
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం , దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||
    ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్
ஸ்ரீ அல்லது சிறீ என்றால் செல்வம் எனப் பொருள்படும்.


Buy Now

Buy Now

Click the Below Button to Purchase this Divine Product :

To Purchase

To Purchase Click the Buy now with PayUmoney button.

Enter Product Price, Your name, address with pincode, product code, product price, product name and complete the procedure, you have the freedom to purchase using your credit card / debit card / net banking… its simple.

Your Divine Product will be despatched within 2 to 3 working days through India Post Registered Parcel.

Follow by Email

Total Pageviews

Google+ Followers

Followers

Purchase Instructions

Indian Customers who are interested to purchase our products through PayUmoney :-


Click the Buy now with PayUmoney button.

Type Product Price, Your name, address with pincode, product code, product name and complete the procedure, you have the freedom to purchase using your credit card / debit card / net banking… its simple.

If you wish to purchase multiple products at a time, add the product price of all the products you wish to purchase and enter the total amount and follow the instructions above. Your product will be despatched in 2 to 3 working days through India Post Registered Parcel.

Indian Customers who are interested to purchase our products through Net Banking :

Our Banks Details :
State Bank of India
Account Holder Name : V. Srihari,
Account Number : 30127268269,
Branch : Chennai West Mambalam,
IFSC.Code : SBIN0001683.

Lakshmi Vilas Bank
Account Holder Name : V. Premkumar,
Account Number : 0440301000001628,
Branch : Chennai T.Nagar,
IFSC. Code : LAVB0000440.

Overseas Customers who are interested to purchase our products through Paypal :

Please Note : Silver, Gemstone Products cannot be despatched outside India.

Convert the Product price + Postage Rs.1400/- Extra from Indian Rupees to US Dollars using the indian rupee convertor on the top right corner of this website and get the price in US Dollars.

For Example the product price is Rs.250/- enter Rs. 250 + Rs.1400/- Postage = Total Rs. 1650/- in the convert slot where 1 is displayed and find the equivalent convertion of US Dollars for Rs.1650/-

Let’s assume that the equivalent of Rs.250/- + Rs. 1400/- Postage = Total Rs. 1650/- is 28.23 Dollars then click the paypal buynow button and enter 28.23 dollars in item price slot and click update.

Now go to the choose the way to pay and complete the procedure… its simple.

If you wish to purchase multiple products at a time, add the product price of all the products you wish to purchase and convert the total value to US Dollars and follow the instructions above.

After Purchasing through Paypal / PayUmoney / Transferring the amount through Net Banking :

Call / SMS / Whatsapp Mobile +919840259871 or Call Landline +914424837505 and give your name, address with pincode, phone number and the product will be despatched in 2 to 3 working days through India Post Registered Parcel.